|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:48 AM
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 200 రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన నేడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మొత్తం 200 కొత్త రైళ్లలో 50 నమో భారత్ రైళ్లు, 100 మెమూ రైళ్లు, మరో 50 అమృత్ భారత్ రైళ్లు ఉంటాయని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త రైళ్లకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.అంతకుముందు, హర్యానాలోని మనేసర్‌లో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌ను అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మెమూ రైళ్లలో కోచ్‌ల సంఖ్యను 8-12 నుంచి 16-20కి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయంతో తక్కువ దూరాలకు ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
Latest News