|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:35 AM
పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం కచ్చితంగా పల్నాడుకు వస్తారని వైయస్ఆర్‌సీపీ నేతలు విడదల రజిని, కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వైయస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం.. జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, వైయస్ జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. వైయస్ జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అయినా వైయస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం’’ అని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
Latest News