అర్జెంట్‌గా మీటింగ్‌కు రావాలని..ఎయిర్ఇండియా అధికారులకు డీజీసీఏ సమన్లు
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 07:54 PM

గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదంగా నిలిచింది. ఈ దుర్ఘటనలో 270మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో ఎయిర్ఇండియా అధికారులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్- డీజీసీఏ సమన్లు జారీ చేసింది. వెంటనే మీటింగ్‌కు హాజరు కావాలని చెప్పింది.


డైరెక్టర్ జనరల్ ఫాజి అహ్మద్ కిడ్వాయ్ నేతృత్వంలో మంగళవారం (జూన్ 17) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్‌లో ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్, ఏఐ డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ కెప్టెన్ పంకుల్ మథుర్, ఏఐ ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్‌తో పాటు మరికొందరు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఇంతకుముందే బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాలన్నింటిలో భద్రతా తనిఖీలు నిర్వహించాలని విమానయాన సంస్థకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా GEnx ఇంజిన్లు, టేకాఫ్ పారామీటర్లు, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్, ఇంధన వ్యవస్థ వంటి వాటిపై దృష్టి సారించాలని తెలిపింది. జూన్ 16 వరకు 22 డ్రీమ్‌లైనర్ విమానాల్లో సెక్యురిటీ తనిఖీలు నిర్వహించారు. ఎయిర్‌ఇండియాలో మొత్తం 33 డ్రీమ్‌లైనర్ విమానాలు ఉన్నాయి. అయితే వాటిలో పెద్ద సమస్యలు బయటపడలేదు. తనిఖీల సమయం ఎక్కువ అవడంతో ఇందులో కొన్నింటి సర్వీస్‌లను నిలిపివేశారు. ఇక ఇరాన్ గగనతలం ముసివేసిడంతో మని కొన్నింటిన సస్పెండ్ చేశారు.


ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను గుర్తంచేందుకు డీఎన్‌ఏ శాంపిళ్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే 120కి పైగా మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఘటనా స్థలం నుంచి విమానంలోని బ్లాక్ బాక్స్‌ను అధికారులు రికవర్ చేశారు. విమానం ప్రమాదానికి గురయ్యే సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఈ బ్లాక్ బాక్స్ డేటా కీలకం కానుంది.


ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు (SOPs), ఇలాంటి ప్రమాదాలను నివారించే మార్గదర్శకాలను పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలను నివారించడానికి విస్తృత మార్గదర్శకాలను సూచించనుంది. మెకానికల్ ఫెయిల్యూర్, మానవ తప్పిదం, వాతావరణ పరిస్థితులు, రెగులేటరీ కాంప్లియన్స్ సమస్యలతో సహా.. ప్రమాద మూల కారణాన్ని నిర్ధరిస్తుంది. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు చేసే హ్యాండ్లింగ్, మేనేజ్‌మెంట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను రూపొందిస్తుంది. విధాన మార్పులు, ఆపరేషనల్ ఇంప్రూవ్‌మెంట్స్, ట్రైనింగ్‌ మార్పులను సూచిస్తుంది.

Latest News
Saka seals Arsenal's place in Champions League final Wed, May 06, 2026, 12:29 PM
UN welcomes Russian, Ukrainian unilateral ceasefires Wed, May 06, 2026, 12:25 PM
New Zealand unemployment down to 5.3 pc in Q1 Wed, May 06, 2026, 12:20 PM
TVK reaches out to CPI for support as Vijay intensifies bid to form govt in TN Wed, May 06, 2026, 12:15 PM
Bihar Cabinet meeting today as NDA finalises strategy for upcoming expansion Wed, May 06, 2026, 12:14 PM