|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 06:53 PM
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని 1355 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న సుమారు లక్ష మంది విద్యార్థులకు.. ఉచితంగా జేఈఈ, నీట్ కోచింగ్ అందిస్తోంది. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. విద్యా సంస్కరణలలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. సాంఘిక, ఆర్థిక అసమానతాలను తొలగించి గ్రామీణ విద్యార్థుల ప్రతిభను జాతీయ స్థాయిలో చాటేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమ్యాటిక్స్ సబ్జెక్టుల మీద నిపుణులు రూపొందించిన మెటీరియల్ వీరికి అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన విద్యా నిపుణులు ఆరునెలల పాటు శ్రమించి ఈ స్టడీ మెటీరియల్ రూపొందించారు. అలాగే ఈ విద్యార్థుల కోసం కాలేజీ పనివేళలను కూడా 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పొడిగించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా రెండు గంటలు కేటాయిస్తు్న్నారు.
మరోవైపు ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్ అందించే విషయంపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభించినందుకు గర్వంగా ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. 1,355 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని లక్ష మంది విద్యార్థులకు నిపుణులతో కూడిన స్టడీ మెటీరియల్‌తో పాటు ఉచిత JEE , NEET కోచింగ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో IIT/NEET-స్థాయి విద్యా మద్దతును అందిచడం ఇదే తొలిసారని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రతిభ, జాతీయ ఆకాంక్షల మధ్య అంతరాన్ని తగ్గించే నిర్ణయమని తెలిపారు. MPC , BiPC విద్యార్థులు ఇప్పుడు రోజువారీ కోచింగ్‌తో పాటు, అభ్యాస గంటల పొడిగింపు, నిర్మాణాత్మక పరీక్షలతో పాటుగా.. ఉన్నత ప్రైవేట్ సంస్థల మాదిరిగానే విద్యార్థుల పురోగతిని కూడా తెలుసుకోవచ్చని నారా లోకేష్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్య ప్రతి పిల్లల హక్కు అని ట్వీట్ చేసిన లోకేష్.. ఈ మోడల్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి విద్యార్థికి పెద్ద కలలు కనడానికి.. వాటిని సాధించడానికి అవకాశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
Latest News