|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:19 PM
కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని తాజాగా ప్రకటించారు. అయితే, రైతులు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే E-KYC చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో ఈ-కేవైసీ కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ-కేవైసీ కోసం రైతు సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వెల్లడించింది. అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటోమెటిక్‌గా అప్డేట్ చేసినట్లు తెలిపారు.సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఆ రైతుల వివరాలను రైతు సేవా కేంద్రాలకు పంపడం జరిగిందని తెలిపారు. అందులో పేర్లు ఉన్న రైతులు ఈ కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని తెలిపింది. ఈ నెల(జూన్) 20వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించారు.ఇదిలా ఉంటే.. రైతులు తాము ఈ-కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశంపై మొబైల్‌లో అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళితే తెలుసుకోవచ్చు. అలాగే ఈ వెబ్‌సైట్ లో అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది.
Latest News