25 లక్షల ఐటీఆర్ లు ఫైలింగ్.. మీరు పూర్తి చేశారా
 

by Suryaa Desk | Mon, Jun 16, 2025, 11:44 PM

వ్యక్తిగత ఆదాయపు పన్నులకు సంబంధించిన ఐటీ రిటర్నుల ఫైలింగ్ వేగంగా జరుగుతోంది. ఐటీఆర్ ఫారాలు, యుటిలిటీలను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో గత ఆర్థిక సంవత్సరం 2024-25 (అసెస్మెంట్ ఇయర్ 2025-26)లకు సంబంధించిన ఆదాయ వివరాలను ఫైల్ చేస్తున్నారు ట్యాక్స్ పేయర్లు. రెండు వారాల్లోనే 25 లక్షల ఐటీ రిటర్నులు దాఖలైనట్లు తెలుస్తోంది. అందులో 23 లక్షల ఐటీ రిటర్నులను ట్యాక్స్ పేయర్లు వెరిఫై చేశారు. ఈ క్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సైతం ఐటీఆర్ ప్రాసెసింగ్ మొదలు పెట్టడం గమనార్హం. ట్యాక్స్ పోర్టల్‌లోని వివరాల ప్రకారం ఇప్పటికే పలు ఐటీ రిటర్నుల ప్రాసెసింగ్ సైతం మొదలైంది. అంటే ట్యాక్స్ పేయర్లకు త్వరగానే రీఫండ్ వస్తుంది.


ఈ ఏడాది ఐటీ రిటర్నుల ఫైలింగ్ చాలా ఆలస్యంగా మొదలైంది. ఐటీఆర్ ఫారాలు ఆలస్యంగా విడుదల చేయడం, ఇ-ఫైలింగ్ యుటిలిటీల్లో సాంకేతిక మార్పులు చేయడం, ట్యాక్స్ డిడక్షన్ డేటా తీసుకోవడంలో జాప్యం వంటి కారణాలు ఉన్నాయి. ఏప్రిల్ చివర్లో ఐటీఆర్-1, ఐటీఆర్ 4 ఫారాలను నోటిఫై చేసింది ఆదాయపు పన్ను శాఖ. సుమారు 25 రోజులు ఆలస్యంగా తీసుకొచ్చింది. అయితే, మే చివరి వరకు ఆన్‌లైన్ యుటిలీటీలను యాక్టివేట్ చేయలేదు. దీంతో ఐటీఆర్ ఫైల్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు ఆదాయపు పన్ను విభాగం ఊరట కల్పించింది. ఐటీఆర్ గడువు తేదీని జులై 31, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. మరో నెలన్నర గడువు ఇచ్చింది.


ఐటీఆర్ స్టెటస్ తనిఖీ ప్రాసెస్


ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incomtax.gov.inలోకి లాగిన్ కావాలి.


హోమ్ పేజీలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


మీ ACK నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.


మీ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది.


దానిని ఎంటర్ చేసి వెరిఫై చేశాక మీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


మీరు విజయవంతంగా ఫైల్ చేస్తే Filed అని వస్తుంది లేదంటే View Filed Returnsఅని వస్తుంది.


రీఫండ్ స్టేటస్ తెలుసుకునే ప్రాసెస్..


ఆదాయపు పన్ను అధికారిక పోర్టల్‌లో నో యువర్ రీఫండ్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి.


మీ పాన్ కార్డ్ నంబర్, అసెస్మెంట్ ఇయర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.


మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.


ఆ తర్వాత స్క్రీన్‌పై మీ రీఫండ్ స్టేటస్ కనిపిస్తుంది.


మరోవైపు NSDL వెబ్‌సైట్ ద్వారా పాన్ కార్డ్, అసెస్మెంట్ ఇయర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.


TRACES పోర్టల్‌లోకి లాగిన్ అయి సైతం రీఫండ్ సమాచారం తెలుసుకోవచ్చు.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM