|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 11:41 PM
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లు తలపడ్డ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. మూడు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా టెస్టు జట్టులో ఉన్న పలువురు ప్లేయర్లు సత్తాచాటారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లో రాణించారు. బౌలింగ్‌లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రాలు వికెట్లు తీశారు. అయితే మూడో రోజు ఆటలో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ సెంచరీతో అదరగొట్టాడు. 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తనకు తుది జట్టులో చోటు కల్పించాల్సిందే అని సంకేతాలు మేనేజ్‌మెంట్‌కు ఇచ్చాడు.
తాజా ప్రదర్శనతో శార్దూల్ ఠాకూర్ ఈనెల 20 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్టుకు ముందు భారత సెలెక్టర్లకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో మెరిసిన మరో ఆల్‌రౌండర్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి పోటీగా మారాడు. శార్దూల్ తాజా ప్రదర్శన నేపథ్యంలో జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే తొలి టెస్టులో ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులో తీసుకోవాలనే సందిగ్ధత నెలకొంది.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత్.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో తలపడింది. ఇందులో భారత్, భారత్-ఏ జట్లు తలపడ్డాయి. వాస్తవానికి ఈ మ్యాచ్ నాలుగు రోజులు జరగాల్సింది. కానీ తొలి టెస్టుకు ముందు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు రోజుల్లోనే ముగించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత సీనియర్ జట్టు 459 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహల్ హాఫ్ సెంచరీలు చేశారు. టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 76 బంతుల్లో 101 పరుగులు చేసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఇక ఆల్‌రౌండ్ శార్దుల్ ఠాకూర్.. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ వంటి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అజేయ సెంచరీతో సత్తాచాటాడు. మరి ఈ ప్రదర్శన ఆధారంగా ఠాకూర్‌కు తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా అన్నది మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు హెడింగ్లే వేదికగా జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.
Latest News