|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 06:46 PM
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబుతో భేటీ అవ్వలేదంటూ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ రంగంలో ఉన్న ప్రముఖులకు ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత లేదని కీలక ప్రకటన విడుదల చేసారు. 'హరి హర వీరమల్లు' విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేస్తారనే న్యూస్ బయటకు రావడంతో, రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్ అంటూ పవన్ కాస్త ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిని కలవడానికి సినీ ప్రముఖులు రెడీ అయ్యారు.
సీఎం చంద్రబాబు నాయుడుతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. జూన్ 15 ఆదివారం సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ మీటింగ్ జరగనుంది. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి, థియేటర్ల నిర్వహణ, చిత్ర పరిశ్రమలోని సమస్యలు, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదే విషయమై సినీ ప్రముఖులంతా కలిసి రావాలని సీఎం సూచించారని తెలుస్తోంది. దాదాపు 30 మంది సినీ పెద్దలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.
Latest News