|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 03:08 PM
అహ్మదాబాద్‌లోని మేఘానిలో ఎయిర్‌ఇండియా విమానం కుప్పకూలిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రిని ఆదేశించారు.
ప్రమాదానికి గురైన విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు.