|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 03:05 PM
త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం పాండు నాయక్ మాట్లాడుతూ, "మాటూరు గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కోట నాయక్, కృష్ణ నాయక్ కూడా పాల్గొన్నారు.