|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 06:38 PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 67.27 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.8,745 కోట్లు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ పొందిన వారికి కూడా తల్లికి వందనం డబ్బులు అందించనున్నారు. ఇంట్లో ఎంతమంది స్కూలుకు వెళ్లే పిల్లలుంటే అంతమందికీ తల్లి వందనం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యి.. ఆ సమాచారం అందుబాటులోకి రాగానే నిధులు జమ చేయనున్నారు.
తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఏటా రూ.15000 జమ చేస్తారు. అయితే ఈ పథకం లబ్ధి పొందేందుకు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకులో జమ కావాలంటే.. విద్యార్థులు, వారి తల్లులు హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో నమోదు చేసుకుని ఉండాలి. అలాగే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు చెప్తున్నారు. హౌస్ హౌల్డ్ డేటా బేస్‌లో నమోదు చేసుకోకపోతే చేసుకోవాలని సూచిస్తున్నారు.
అలాగే తల్లికి వందనం నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌లకు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేయకపోతే అకౌంట్‌లో డబ్బులు జమకావని అధికారులు చెప్తున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్లకు ఎన్‌పీసీఐ లింకింగ్ తప్పనిసరి. అలాగే బ్యాంక్ అకౌంట్‌లకు ఆధార్ అనుసంధానం చేసుకుని ఉండాలి.
ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే వెంటనే అనుసంధానం చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు సూచిస్తున్నారు. న్‌పీసీఐ లింకింగ్ కోసం బ్యాంక్‌కు వెళ్లాలని.. స్టేటస్ చెక్ చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయం, మీసేవ కేంద్రంలో చెక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవన్నీ కచ్చితంగా ఉంటేనే పూర్తి తల్లికి వందనం డబ్బులు అకౌంట్‌లో జమ అవుతాయని చెప్తున్నారు.
Latest News