బాలికపై 13 మంది అత్యాచారం
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 08:00 PM

శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. దళిత బాలికపై గత రెండేళ్లుగా 13 మంది అత్యాచారం చేస్తున్న ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ఈ అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో మైనర్ల నుంచి 50 ఏళ్ల పైబడిన వ్యక్తులు వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్ళితే... రామగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో దళిత వర్గానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. సదరు బాలికపై రెండేళ్లుగా కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేస్తున్నారు. ఆ క్రమంలో సదరు బాలిక తల్లిదండ్రులు.. పంచాయితీ కోసం గ్రామపెద్దల వద్దకు వెళ్లారు. దీంతో వారు సైతం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి రెండుసార్లు అబార్షన్ చేయించారు. ఆ తర్వాత చిన్నారి కుటుంబాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొండగుట్టల్లో దాచారు. ఈ వ్యవహారం కాస్తా వెలుగులోకి రావడంతో రామగిరి పోలీసులు ఆరా తీశారు. అనంతరం దళిత బాలిక కుటుంబం జాడ కనిపెట్టి.. అనంతపురంలోని సత్య కేంద్రానికి వారిని తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు. నిందితులపై ఫోక్సో యాక్ట్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని.. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రత్న వివరించారు.

Latest News
WPI inflation, India-US trade talks, Rupee movement likely to drive market next week Sun, Dec 14, 2025, 01:00 PM
Telangana CM thanks Messi for enthralling fans in Hyderabad, congratulates security personnel Sun, Dec 14, 2025, 12:59 PM
The Third Eye: Putin's India visit adds to geopolitical balance Sun, Dec 14, 2025, 12:12 PM
North Korea completes building 2nd modern regional hospital Sun, Dec 14, 2025, 11:51 AM
Greek farmers reject talks as protests escalate into third week Sun, Dec 14, 2025, 11:35 AM