సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణ చెప్పాలి
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:51 PM

సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసనలు తెలిపారు. సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయం ఎదురుగా ధర్నాకు దిగారు.రాష్ట్ర మహిళలందరికీ తక్షణమే సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని విశాఖలో ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని అమరావతి, మహిళలపై జర్నలిస్ట్‌లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు మహిళలు ఖండించారు. అలాగే అనకాపల్లిలో కూడా వైసీపీకి వ్యతిరేకంగా తెలుగు మహిళలు నిరసన తెలిపారు. అనకాపల్లి నెహ్రూచౌక్ జంక్షన్‌లో సాక్షి దినపత్రికను తగలబెట్టి నిరసన తెలియజేశారు. అలాగే కోనసీమలోని రామచంద్రపురంలో సాక్షి దినపత్రిక ప్రతులను చెప్పులతో కొట్టి చించివేశారు.

Latest News
India emerges as world’s 3rd most competitive AI power Sun, Dec 14, 2025, 01:55 PM
Manhunt intensifies for Brown University shooter, campus on lockdown Sun, Dec 14, 2025, 01:50 PM
Congress workers raise derogatory slogans against PM Modi during 'vote chori' protest in Delhi Sun, Dec 14, 2025, 01:48 PM
Centre taking special steps to boost growth of MSMEs Sun, Dec 14, 2025, 01:37 PM
Illegal drug recovered, 2 smugglers detained in Western Afghanistan Sun, Dec 14, 2025, 01:35 PM