వాడిని వదిలిపెట్టండి..: కన్నీటి పర్యంతమవుతున్న రాజ్ కుశ్వాహా తల్లి
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:30 PM

వాడిని వదిలిపెట్టండి..: కన్నీటి పర్యంతమవుతున్న రాజ్ కుశ్వాహా తల్లి

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నేరుగా హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులు సహా మృతుడు రాజా రఘవంశీ భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహాలు ఇందులో ఉన్నారు. అయితే ఇంటి దగ్గరే ఉండి ప్లాన్ అంతా నడిపించినట్లు భావిస్తున్న రాజ్ కుశ్వాహాకు.. ఈ కేసుతో ఎలాంటి సంబంధమూ లేదని అతడి తల్లి సావిత్రి కుశ్వాహా చెబుతోంది. కన్నీటి పర్యంతం అవుతూనే తన కుమారుడు వట్టి అమాయకుడిని వివరిస్తోంది. అతడికి కేవలం 20 ఏళ్ల వయసు మాత్రేనని.. హత్య చేసేంత రాక్షసత్వం అతడిలో లేదని పేర్కొంటుంది. తన కొడుకును కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని.. వెంటనే విడుదల చేయాలని డిమాంచ్ చేస్తున్నారు.


మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కుశ్వాహా తల్లి సావిత్రి కుశ్వాహా మీడియాతో మాట్లాడుతూ.. "నా కొడుకు ఈ హత్య చేయలేడు. అతడికి కేవలం 20 ఏళ్లు. వాడే నా సర్వస్వ. నా కొడుకు సోనమ్ సోదరుడి ఫ్యాక్టరీలో పని చేశాడు. అతడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా కొడును నిర్దోషి అని నిరూపించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అతడు నిజంగా నిర్దోషి" అని తెలిపారు. అలాగే రాజ్ కుశ్వాహా సోదరి కూడా మాట్లాడుతూ.. తన సోదరుడు నిర్దోషి అని చెప్పింది.


 తన సోదరుడు రాజ్ కుష్వాహా హత్య జరిగిన రోజు ఎక్కడికీ వెళ్లలేదని.. కావాలంటే మీరు అతడి ఆఫీసుకు వెళ్లి అందరినీ విచారించుకోవచ్చని చెప్పింది. ఎలాంటి తప్పు చేయని తన సోదురుడిని విడుదల చేయాలని మాత్రమే తాను కోరుతున్నట్లు వ్యాఖ్యానించింది. రాజ్ కుశ్వాహాతో పాటు తనకు మరో సోదురుడు కూడా ఉన్నాడని.. ఈ ఇద్దరూ ఎప్పుడు ఎలాంటి తప్పులు చేయరనే పూర్తి నమ్మకం తనకు ఉందని పేర్కొంది.


ఇదిలా ఉండగా.. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ దండోతియా మంగళవారం నాడు రాజా రఘువంశీ హత్య కేసులు సంబంధించిన పూర్తి విషయాలను మీడియాకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అందులో సోనమ్ రఘువంశీ, ఆకాష్ రాజ్ పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్, రాజ్ కుశ్వాహాలు ఉన్నట్లు వివరించారు. అయితే వీరందరినీ ఆదివారం రోజు కోర్టులో హాజరుపరిచి ఏడు రోజుల ట్రాన్సిట్ రిమాండులోకి పంపినట్లు తెలిపారు. అలాగే నాలుగో నిందితుడు అయిన ఆనంద్‌ను ఇండోర్‌కు తరలించి మంగళవారం రోజు కోర్టులో హాజరు పరచబోతున్నట్లు వెల్లడించారు.

Latest News
India has never seen shortage of fuels: Hardeep Puri Sun, Jul 06, 2025, 06:14 PM
Amit Shah backs Gujarat's salt cooperatives, applauds Amul’s expanding legacy Sun, Jul 06, 2025, 06:02 PM
LG Electronics to work with Saudi Arabia to develop HVAC solutions Sun, Jul 06, 2025, 05:50 PM
Odisha: Puri witnesses huge influx of devotees on 'Suna Besha' Sun, Jul 06, 2025, 05:45 PM
2nd Test: Start of day five play delayed due to heavy rain at Edgbaston Sun, Jul 06, 2025, 05:41 PM