వివాహితను కత్తితో పొడిచి చంపిన ప్రియుడు,,,అనాథలుగా మారిన పిల్లలు
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:26 PM

వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. అనేకమంది చావులకు కారణమై కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అనాలోచితంగా చేసే తప్పులకు అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటకలోని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితను ఆమె ప్రియుడు అతి కిరాతకంగా 17 సార్లు పొడిచి చంపాడు. చివరిసారి కలుద్దామని పిలిచి మరీ మహిళను పొట్టనపెట్టుకున్నాడు. ఆమె ఇద్దరు కుమార్తెలను అనాథలను చేశాడు. అయితే హత్య తర్వాత నిందితుడు అన్న మాటలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి.


  వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరులోని బాణశంకరి పరిధిలో హేమ్మిగేపుర ప్రాంతానికి చెందిన హరిణి (33), దేసేగౌడ (41) భార్యాభర్తలు. 2012లో పెళ్లైన ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం, బాధ్యతలు, పిల్లలు.. ఇవన్నీ హరిణి జీవితంలో భాగమయ్యాయి. సాఫీగా సాగుతున్న జీవితంలోకి మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి ప్రవేశించాడు.


మూడు సంవత్సరాల క్రితం ఒక జాతరలో కామన్ ఫ్రెండ్ ద్వారా హరిణికి.. యశాస్ (25) అనే టెకీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచుగా యశాస్‌ను కలుస్తూ, తన సంసార జీవితాన్ని పక్కన పెడుతూ వచ్చింది హరిణి. అయితే ఈ విషయం హరిణి భర్త, కుటుంబ సభ్యులకు తెలియగా.. వారు షాక్‌కు గురయ్యారు. కౌన్సిలింగ్ ఇచ్చి.. బంధాలు, విలువలు, కుటుంబ గౌరవం గురించి వివరించారు. హరిణి కూడా తన తప్పును తెలుసుకుని.. గత రెండు నెలలుగా యశాస్‌ను కలవడం మానేసింది. అందరిలాగే తన జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంది.


ఈ క్రమంలో చివరిసారిగా కలుద్దామని హరిణిని.. యహాస్ అడిగాడు. అందుకు నిరాకరించిన హరిణి.. తన భర్త విషయం తెలిసిపోయిందని, మరోసారి కలవలేనని చెప్పింది. యశాస్ చాలా సేపు ప్రయత్నించి హరిణిని ఒప్పించాడు. దీంతో ఈ నెల 6వ తేదీన పూర్ణ ప్రజ్న లేఅవుట్‌లోని ఓయో హోటల్‌లో యుశాస్, హరిణి కలుసుకున్నారు. హరిణి తనతో బంధం తెంచుకుంటుందని కోపోద్రిక్తుడైన యశాస్.. ముందుగానే తెచ్చుకున్న కత్తితో ఆమెను 17 సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. యశాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు వివాహేతర సంబంధం ముగించడం ఇష్టం లేదని, అందుకే హరిణిని హత్య చేశానని నేరం అంగీకరించాడు యశాస్. అతడి సమాధానం బాధితురాలిని కుటుంబ సభ్యులను మరింతగా కుంగదీసింది. ఓ వ్యక్తి స్వార్థంతో క్షణికావేశంలో చేసిన తప్పు.. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది.

Latest News
Gill axed, Axar named vice-captain; Ishan returns as India name T20 WC squad Sat, Dec 20, 2025, 02:32 PM
Tamil Nadu BJP chief slams DMK govt over action against protesting nurses Sat, Dec 20, 2025, 02:27 PM
Child killed as BNP leader's house set ablaze amid rising violence in Bangladesh Sat, Dec 20, 2025, 02:24 PM
'Make in India' booster: Electronics exports rise about 38 pc in April-Nov Sat, Dec 20, 2025, 01:31 PM
Cambodia says Thai army bombs bridge inside Cambodian territory Sat, Dec 20, 2025, 01:28 PM