రాజా రఘువంశి హత్యానంతరం ఏం జరిగింది
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:12 PM

రాజా రఘువంశి హత్యానంతరం ఏం జరిగింది

మేఘాలయ అందాల నడుమ మొదలైన ఆ హనీమూన్.. అంతానికి చేరిన తీరు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాజా రాఘువంశీ హత్య కేసులో ఆయన భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా హస్తం ఉన్నట్లు ఇప్పటికే తేలిపోగా.. పోలీసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే భర్త హత్యానంతరం సోనమ్ ఎక్కడికి వెళ్లింది, గత 18 రోజులుగా ఆమె ఎక్కడ గడిపిందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈక్రమంలోనే పోలీసులు విచారణ జరిపి మరీ ఈ విషయాన్ని బయటకు లాగారు. భర్త హత్య సోనమ్ ఏమేం చేసిందో పూర్తిగా తెలుసుకున్నారు.


భార్యతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ అక్కడే హత్యకు గురయ్యాడు. అయితే ఇతడితో పెళ్లి ఏమాత్రం ఇష్టలేని భార్య సోనమే.. ఇతడి హత్యకు పథక రచన చేసినట్లు తేలింది. ముఖ్యంగా పైళ్లైన నాలుగు రోజులకే తల్లిగారింటికి వెళ్లిన సోనమ్.. తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి రాజా హత్యకు ప్లాన్ వేసింది. ఆపై ఇంటికొచ్చి భర్తను హనీమూన్ కోసం ఒప్పించగల్గింది. ఇందుకోసం నేరుగా ఆమెనే బస, ప్రయాణ టికెట్లన్నీ బుక్ చేసింది. తనతో పాటే తీసుకు వెళ్లగలిగింది. అయితే మే 20వ తేదీన వీరిద్దరూ మేఘాలలయకు వెళ్లగా.. ప్లాన్ ప్రకారం సుపారీ ఇచ్చిన నిందితులతో మే 23వ తేదీన రఘవంశీని హత్య చేయించినట్లు సమాచారం.


  అయితే భర్త హత్యానంతరం అతడి మృతదేహాన్ని అక్కడే ఉంచి.. ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి సోనమ్ 11 కిలో మీటర్లు నడిచి వెళ్లింది. ఆ తర్వాత సోనమ్ గుహవటికి వెళ్లి అక్కడి నుంచి రైళ్లో మే 25వ తేదీన ఇండోర్‌కు చేరుకుంది. అక్కేడ సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ఆమెకోసం ఓ హోటల్లో గదిని బుక్ చేయగా.. అక్కడకు వెళ్లిపోయింది. గత 18 రోజులుగా ఆమె అక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఒంటరిగా ఉంటే భయపడుతుందేమోనన్న ఉద్దేశంతో ప్రియుడు రాజ్ కుశ్వాహా కాడా ఆమె గది పక్కనే మరో రూమ్ తీసుకుని అద్దెకు ఉన్నాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


అలాగే ముగ్గురు కిరాయి హంతకుల కోసం కూడా రాజ్ కుశ్వాహా ఓ ఇంట్లో మకాం ఏర్పాటు చేశాడు. ఈక్రమంలోనే జూన్ 2వ తేదీన ఉత్తర కాశీ కొండ్లలోని ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కాగా.. అతడి తలపై పదునైన కత్తితో నరికిన గాయాలు కనిపించాయి. దీంతో పోస్టుమార్టం చేయించిన పోలీసులకు ఆ నివేదికలో మరిన్ని ఆధారాలు లభించాయి. ముఖ్యంగా హత్యకు వాడిన ఆయుధం అక్కడి ప్రజలు వాడే ఆయుధం కాకపోవడంతో.. వేరే ప్రాంత ప్రజలే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. అందులోనూ సోనమ్ దొరికాకా ఆమె తీరులో తేడా ఉండగా.. ఆమె ఫోన్ చెక్ చేసి మరీ దీన్ని ఈమెనే చేయించిన హత్యగా తేల్చారు. అలాగే ఆమె తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు.


మరోవైపు రాజ్ కుశ్వాహా ఓ ట్యాక్సీ మాట్లాడి సోనమ్‌ను ఉత్తర ప్రదేశ్‌కు పంపించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యకు ప్లాన్ చేసిన విషయం సహా మే 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. అలాగే ఆ మరుసటి రోజే సోనమ్ పోలీసుల ఎదుటకు వచ్చి.. ఎవరో ఆగంతకులు బంగారం కోసమే తన భర్త చంపి, తనను కిడ్నాప్ చేసినట్లు వివరించింది. కానీ అప్పటికే రాజ్ కుశ్వాహా ద్వారా విషయాలన్నీ వెలుగులోకి రాగా.. ఆమెది డ్రామా అని వెంటనే గుర్తించి జైల్లో పెట్టారు. ప్రస్తుతం వీరు ఏడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌లో ఉన్నారు.

Latest News
Heavy rains disrupt normal lives in Delhi-NCR, key roads waterlogged Mon, Jul 07, 2025, 11:36 AM
Telangana CM launches plantation drive, urges women to take care of saplings like children Mon, Jul 07, 2025, 11:32 AM
Stone-pelting, clashes in Bihar's Hajipur during Muharram procession Mon, Jul 07, 2025, 11:22 AM
LG Electronics Q2 operating profit down 46.6 pc due to rising tariff Mon, Jul 07, 2025, 11:22 AM
Man arrested in Delhi for trying to reactivate Baba Siddique's mobile phone number Mon, Jul 07, 2025, 11:16 AM