![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:17 PM
భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం, ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి టీ దుకాణానికి నిలయంగా మారింది. భారత్- పాకిస్థాన్ సరిహద్దులో ఓ కుటుంబం గత మూడు తరాలుగా టీ షాప్‌ను నిర్వహిస్తోంది. ఈ షాప్‌ను అందరూ భారతదేశపు మొట్టమొదటి టీ దుకాణంగా పిలుస్తుంటారు. అసలు ఎప్పుడు ప్రారంభమైంది? భారతదేశంలోనే మొట్టమొదటి టీ దుకాణంగా పేరొందిన షాపు 1984 కన్నా ముందు నుంచి నడుస్తోంది. దీని యజమాని సురేశ్ సింగ్. అతడి తండ్రి గుర్నామ్ సింగ్, తాత కూడా ఇదే టీ షాప్ నడిపేవారు. పంజాబ్‌లోని ఫజిల్కాలోని అసఫ్‌వాలా గ్రామంలో ఉందీ దుకాణం. తాత - 1965 నుండి సేవ గతంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. అయినా నేను నా దుకాణాన్ని మూసివేయలేదు. కానీ ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని భారత సైనికులకు చెప్పాను. మా తాత 1984కి ముందే ఈ దుకాణాన్ని నడపడం ప్రారంభించాడు. అప్పటి నుంచి మా కుటుంబంలోని తర్వాతి తరాలు ఈ దుకాణం నడపడంపై శ్రద్ధ చూపుతున్నాయి. దేశంలోని ఏదో ఒక రాష్ట్రం నుంచి కొంత మంది యువకులు సైనిక కవాతును చూడడానికి భారత సరిహద్దుకు వస్తుంటారు. వారు నా షాప్‌లో టీ తాగినప్పుడు ఒక బోర్డును తయారు చేసి ఇచ్చారు. భారతదేశపు మొదటి టీ షాప్ అని మా దుకాణానికి వారు పేరు పెట్టారు. తొలుత తాను అసఫ్‌వాలా గ్రామంలో ఫంక్చర్ దుకాణం ప్రారంభించానని, తర్వాత టీస్టాల్ ఓపెన్ చేశానని సురేశ్ సింగ్ తండ్రి గుర్నామ్ సింగ్ చెప్పారు. దాదాపుగా 50 ఏళ్ల క్రితం నుంచి టీ దుకాణం ఉందన్నారు. తన తాత 1965, 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధాలను చూశారని వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచి యుద్ధ వాతావరణాన్ని చూస్తూ పెరిగానని అన్నారు. కార్గిల్ యుద్ధంలో అయినా, ఇటీవల భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధంలోనైనా అసఫ్‌వాలా గ్రామం భారత సైన్యానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. యుద్ధం నడుమ టీ సేవ: సైనికులకు అండగా ను భారత్- పాక్ మధ్య జరిగిన 1971లో జరిగిన యుద్ధాన్ని చూశాను. కాల్పుల గురించి తెలియగానే మేము మా కుటుంబంతో కలిసి వేరే గ్రామానికి వెళ్లిపోయాం. తర్వాత మళ్లీ తిరిగి వచ్చాం. గ్రామస్థులు భారత సైన్యానికి సహాయం చేస్తున్నారు. అప్పట్లో పాక్ మా గ్రామాన్ని చుట్టిముట్టినప్పుడు మా తాతలు గ్రామాన్ని ఖాళీ చేశారు. ఇటీవలే అలా జరగలేదు. యుద్ధం ప్రారంభమైనప్పుడు మేము గ్రామాన్ని వదిలి వెళ్లలేదు. భారత సైన్యానికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరిహద్దు గ్రామాలలో ముఖ్యంగా భారత్-పాక్ బార్డర్ గ్రామాల్లో సాయంత్రం నిశ్శబ్దం ఉండటం తరచుగా కనిపిస్తుంది. కానీ అసఫ్‌వాలా గ్రామంలో అలా కాదు. రిట్రీట్ వేడుక తర్వాత పర్యటకుల సందడి ఉంటుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు సురేశ్ సింగ్ టీ దుకాణానికి వచ్చి టీ తాగుతారు. అలాగే సమోసాలను రుచి చూస్తుంటారు. ఈ టీ స్టాల్ ఒక సెల్ఫీ పాయింట్‌గా కూడా మారిపోయింది.ఈ టీ స్టాల్‌కి కేవలం చాయ్ దుకాణంగా కాకుండా దేశభక్తి, సైనికులకు మద్దతు, కుటుంబ వారసత్వం అనే గౌరవమైన అర్ధం కూడా ఉంది. ఇది అసఫ్‌వాలా గ్రామం గర్వకారణం, దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది.
Latest News