![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 10:26 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దీంతో వెంకన్న సర్వ దర్శనానికి టోకెన్ పొందిన భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. సోమవారం 84,258 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 35,776 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
Latest News