![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:01 PM
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలికపై గత రెండేళ్లుగా 14 మంది యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు తాజాగా బయటపడింది.
బాధిత బాలిక చిత్రహింసలు భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన రాష్ట్రంలో లైంగిక నేరాలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.