![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:00 PM
రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కరా్ ప్రహాసనంగా మార్చేసిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయలోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌కు రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వన్నంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Latest News