![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 05:51 PM
శాతవాహన కళాశాల ఎదుట వైయస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని.. వైయస్ఆర్ , వైయస్ జగన్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు.అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?. కాలేజీ కూల్చేస్తుంటే విద్యాశాఖ మంత్రికి పట్టదా?. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలి. విశాఖ, అమరావతిలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ కళాశాల భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మీ ఎమ్మెల్సీ జాతకం.. అర్ధరాత్రి కాలేజీని కూలగొట్టిన వారి జాతకం మీదగ్గర లేదా?’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.
Latest News