కూటమి పాలనలో మహిళలకి రక్షణ కరువైంది
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 05:49 PM

అనంతపురం జిల్లాలో తన్మయి అనే ఇంటర్ విద్యార్ధిని కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం వలెనే ఆమె హత్యకి గురైందని మాజీమంత్రి విడదల రజిని వాపోయారు. ఆమె మాట్లాడుతూ.... ఈ రోజు సదరు విద్యార్థిని  దారుణమైన స్థితిలో హింసకు గురై చనిపోయినట్లుగా గుర్తించామని పోలీసులు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు అందిన ఆరు రోజుల్లోనే వారు సరైన రీతిలో దీనిపై దర్యాప్తు చేసి ఉంటే, ఈ రోజున తన్మయి అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యేదేనా? పోలీసుల నిర్లక్ష్యం వల్ల సదరు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం గాలించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. ఇది పోలీసుల వైఫల్యం కాదా? దీనిపై అందరూ ప్రశ్నిస్తుంటే, దానిని కప్పిపుచ్చుకునేందుకు అనేక సాకులను తెర మీదికి తీసుకువస్తారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏడాదిగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అదుపుతప్పిన శాంతిభద్రతలను గాడిలో పెట్టే ఆసక్తి ఈ ప్రభుత్వానికి లేదు. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే, స్థానిక ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తేనే దానిపైన స్పందిస్తున్నారు. 

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM