![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:25 PM
చింతగింజల పొడిని కీళ్ల, మోకాళ్ల నొప్పులకు ఔషధంగా వాడుతారు. ఫార్మాస్యూటికల్స్, రంగుల తయారీ, పట్టువస్త్రాల పరిశ్రమల్లో ఈ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి చింతగింజలను చిత్తూరు జిల్లా పుంగనూరుకు తీసుకొచ్చి, అక్కడి యంత్రాల్లో పొడి చేసి ఎగుమతి చేస్తారు. గతంలో కిలో రూ.30–35గా ఉన్న చింతగింజల ధరలు ప్రస్తుతం రూ.40–44కి చేరాయి. దీంతో ఏటా కోట్లలో వ్యాపారం సాగుతోంది.
Latest News