|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 12:35 PM
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడులో జరుగుతున్న జాతరకు ఆమె సోమవారం హాజరయ్యారు. ఈ క్రమంలో ఉపవాసం ఉన్న ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆళ్లగడ్డలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అనంతరం వైద్యులు ఎమ్మెల్యేకు వైద్యం అందించి.. వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తున్నప్పటికి డాక్టర్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News