![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 12:24 PM
మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలోజీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ. వారి కొరకు బహుమతులు. మీ వ్యక్తిగత ఆరోగ్యం, ఆలోచన ,శ్రద్ధ అవసరం నిర్లక్ష్యం తగదు. స్థిరాస్తులు, ఆర్ధిక, వాహన,వ్యవహారాలు కొంతవరకు అనుకూలతతో కూడిన మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మానసిక చికాకుల విషయంలో వైద్యులను సంప్రదిస్తారు. సంతానం యొక్క ఆలోచనలతో చికాకులు లేకుండా సమన్వయం పాటించాలి. వారి అభివృద్ధి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. వారి విద్య కై దూర ప్రదేశాలలో అవకాశాల కొరకు మీ వంతు కృషి చేస్తారు. వారం చివరిలో తండ్రి యొక్క ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి పోటీ పరీక్షల్లో నెగ్గుతారు గణితము లాజిక్కు మొదలైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ రంగాలలో వారికి అనుకూలం. నూతన వాహనాలు కొనుగోలు కొరకు ఆలోచనలు ఉంటాయి. వృత్తిపరమైన విషయాలలో అధిక కృషితో నూతన ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి.మరిన్ని మంచి ఫలితాల కొరకు అమ్మవారి ఆరాధన మంచిది
వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో) వారం ప్రారంభంలో శత్రువుల మీద విజయాలు సాధించడానికి పోటీలలో నెగ్గడానికి మీకు గట్టిగా కృషి చేస్తు ముందుకు వెళతారు ఆరోగ్యం మీదశ్రద్ధ అవసరం. రోగనిరోధక శక్తి కొంతవరకు బాగానే ఉంటుంది. నూతన వృద్ధుల కొరకు ప్రయత్నాలు. ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతారు. మిత్రుల సహకారం. శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారు. లక్ష్యసాధనలో అనుకూలత కొరకు తగిన విధంగా ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. గృహ వాతావరణం సౌకర్యంగా ఉంటుంది. విద్యార్థులకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అపార్థములు రాకుండా తగిన విధంగా ముందుకువెళ్ళాలి. స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఆత్మీయ వ్యక్తులు, మిత్రులు దూరం అవుతారు. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారసత్వ ఆస్తుల లో విషయంలోనూ, డ్రైవింగ్ లోనే తొందరపాటు తనం పనికిరాదు. వారాంతంలో దూర ప్రయాణానికి అవకాశాలు. అసంతృప్తి అధిగమించాలి. మాటల వల్ల ఘర్షణ రాకుండా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తండ్రి ఆరోగ్య సంబంధ అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీరామ జయ రామజయ జయ రామ శ్లోకం మేలు.
మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి) వారం ప్రారంభము ఆర్థిక విషయాలు, పెట్టుబడులు ఆలోచనలు చేస్తారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో అపార్థములు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అధిక ఉద్వేగ పూరితమైన ఆలోచన, సంతానంతో విభేదాలు రాకుండ జాగ్రత్తగా ఉండాలి. వారం మధ్యలో శక్తి వంచన లేకుండా వృత్తి కొరకు అధిక శ్రమ, నూతన అవకాశాలు లభ్యము అవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. సంతానమునకు విదేశీ అవకాశాలు. కొన్నిసార్లు మీ ఆలోచనలు నీకే వ్యతిరేకంగా ఉండడం వల్ల వైరాగ్యధోరణి. జీవిత భాగస్వామికి నూతన అవకాశాలు. తల్లి యొక్క ఆరోగ్యం కొంతవరకు వృద్ధి. మాటలతో పనులు సాధించుకుంటారు వారాంతంలో. దూర ప్రదేశాల్లో ఉంటే సోదరి వర్గం సహకరిస్తుంది. ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ముఖ్యంగా ప్రయాణాలు, మధ్యవర్తిత్వం, ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త అవసరం.పెట్టిన పెట్టుబడుల మీద విషయాలు అభివృద్ధి కొంతవరకు చర్చనీయాంశంగా ఉంటాయి. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనా దేవాలయ సందర్శన మంచిది
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)వారం ప్రారంభం గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉంటుంది, తల్లి ఆరోగ్యం ఆలోచన చేస్తారు. డ్రైవింగ్ చేసేవారు జాగ్రత్తలుతీసుకోవాలి. వాహన విద్య సంబంధ విషయాలు మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. విద్యార్థులు విద్యాసంబంధమైన విషయాలలో వ్రాయటం మీద దృష్టి కేటాయించాలి. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. సంతాన సంబంధ అభివృద్ధి కొరకు, ఆరోగ్య నిమిత్తం ఖర్చులు, తగిన శ్రద్ధ తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వారం చివర్లో బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలి. దూర ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. ఇబ్బంది పెట్టే స్నేహ వర్గానికి దూరంగా ఉండాలి. మీద రుణాలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ శ్లోక పారాయణం మంచిది.
సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)వారం ప్రారంభంలో సహకారం కమ్యూనికేషన్ ప్రయాణాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి చంద్రులు తృతీయ స్థానస్థితి వలన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్రంగా కృషి చేస్తారు. రావలసిన రుణములో అందుకుంటారు. విద్యావిషయాలలో తగిన శ్రద్ధ అవసరం వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమ, ఇతరుల జోక్యం ఇబ్బందిని కలిగిస్తాయి. గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. వాహన , మాతృ సంబంధ అంశాలలో ఖర్చులు. సమయానికి ఆహార స్వీకరణ మంచిది. మిత్రులతో కలిసి వారాంతంలో విందు వినోదాలు కొరకు ఖర్చులు అధికంగా చేస్తారు. సమయ స్ఫూర్తిగా మాట్లాడుతారు.వ్యక్తిగత శ్రద్ధ, హాబీలు మీద దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కొరకు అమ్మవారి ఆరాధన మంచిది.
కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
వారం ప్రారంభం కుటుంబ వ్యవహారాలు, చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. రావలసిన రుణాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. కుటుంబ వ్యవహారాల్లో అపార్ధాలకి ఘర్షనులకి తావివ్వకుండా ముందుకెళ్లాలి. ప్రయాణాల విషయంలో కొత్త వ్యక్తులు పరిచయాలలో ముఖ్యంగా కమ్యూనికేషన్ అంశాలలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యాసంబంధమైన అంశాలలో దూర ప్రయాణాలు విదేశీ అవకాశాలు. ఉన్నత వ్యక్తులని సంప్రదించి పనులు నిర్వర్తించుకునేటప్పుడు నిదానత అవసరం. తండ్రి ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి వ్యవహారాలలో వ్యక్తుల సహకారం అందుతుంది. తల్లిదండ్రుల సౌకర్యాల కోసం ఆలోచనలు చేస్తారు. వ్యవసాయాలు స్వగ్రామ సుదర్శన మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. వారం చివరలోఆలోచనలు బాగుంటాయి. సంతానానికి సంబంధించిన ఆర్థిక ,వృత్తి సంబంధ అంశాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఇతరులకు సలహాలు ఇస్తారు, సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది సృజనాత్మక బావుంటుంది. మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది.
తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
వారం ప్రారంభంవృత్తి సంతాన అంశాల మీద సమాన స్థాయిలో దృష్టి సారించడానికి కృషి చేస్తారు. మానసిక ఉద్వేగాలని అదుపులో చేయించుకోవడానికి మెడిటేషన్ మంచిది. తీవ్ర ఒత్తిడి ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు మీద దృష్టి సారిస్తారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా అభిప్రాయ బెదములకు అవకాశం. ప్రయాణములు అనుకోని ఖర్చులు, వృత్తిరీత్యా, ప్రయాణములు. ఆరోగ్య విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక స్థిమితాన్ని పెంచుకోవాలి. వారము చివరిలో గృహ వాహన విషయాలు, స్థిరాస్తుల సెటిల్మెంట్ కొరకు చేయి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో వాతావరణం కొంత ప్రశాంతత. నూతన వృత్తిల కొరకు ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు కళా రంగంలో ఉండే వారికి అనుకూలతలు. మరిన్ని మంచి ఫలితాల కొరకు శ్రీకృష్ణ మందిరాలు దర్శించడం మేలు.
వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
వారం ప్రారంభంలో నిరాశా,నిస్పృహలు. తల్లితండ్రులతో సంప్రదింపులు ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో చర్చలు, విద్యార్ధులకి విదేశీ అవకాశాలు, నిద్రలేమి, అధిక ఒత్తిడి వృత్తిపరమైన ప్రయాణాలు, రావలసిన రుణములు అందుకునే విషయంలో అధిక ప్రయత్నం. మధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లోవ్యాపారభాగస్వాములతోనూ, పెట్టుబడుల నిమిత్త విషయాలను ఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉండాలి, వైరాగ్య ధోరణి నుంచి బయటపడాలి. నెట్వర్క్ పెంచుకునే విషయంలో తగిన విధముగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, వృత్తి పరిరక్షణ అభివృద్ధి కరంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. దర్పంగా ధీమాగా ఉంటారు. వారాంతము వృత్తిపరమైన విషయాలలో గాసిప్స్ కి దూరంగా ఉండాలి. మైత్రి బంధాలు బలపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి.సోదరీ వర్గముతో చర్చలు సమావేశాలు. సాహసములు పెరుగుతాయి కమ్యూనికేషన్ బాగుంటుంది. మరిన్ని మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ ఆరాధన మంచిది.
ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
వారం ప్రారంభంలో చంద్రుడు లాభ స్థానం సంచారం, నూతన పరిచయాలు, ప్రయాణాలు, విద్యాసంబంధ రీసెర్చ్ అంశాలు ఆకస్మిక లాభాలు. అనుకూలమైన వాతావరణం. ఆశించిన విషయాలలో భూమి ఆదయం, తోబుట్టులతో సంబంధాలు బలపడతాయి. వారము మధ్యలో ఆకస్మిక ఖర్చులు శక్తికి మించి ఉంటాయి. ఆధ్యాత్మి వ్యక్తుల కలయిక, ప్రవచనాలు ప్రసంగాలు ఆనందాన్నిస్తాయి. దూరదేశం పర్యటన కొరకు కొత్త ఆలోచనలు చేస్తారు. నిద్రలేమి, ఒత్తిడి, ఖర్చులు, పెద్దల ఆరోగ్యం కొరకు అధికంగా ఉంటాయి. రుణములు చెల్లిస్తారు. వారం చివర్లో మానసిక ఆనందం, ఉత్సాహం ఆశించిన విషయాలలో విజయం, వృత్తిపరంగా అభివృద్ధి, కొత్త విషయాలు వింటారు. స్థిరాస్తి, భాగస్వామ్య వ్యవహారాలు ముందుకు జరుగుతాయి. ఆకస్మిక బహుమానాలు ఆనందాన్నిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, బంధువుల రాక, విందులు వినోదాలు.మరిన్ని మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది.
మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
వారం ప్రారంభంలో రాజ్యస్థాన చంద్ర సంచారం అనుసరించి వృత్తి విషయంలో, రావలసిన లాభాలని, వృత్తిపరంగా పెట్టిన పెట్టుబడుల విషయంలో అందుకునే అవకాశాలు.నిర్లక్ష్యము చేయకుండా అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. భాగస్వామ్య అంశాలలో కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రహస్య శత్రువులని, విమర్శలని, అవమానాల్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. బ్యూటీ క్లినిక్స్, బోటిక్ నడిపేవారికి అవకాశము లు బాగుంటాయి. మార్టియల్ ఆర్ట్స్, సంగీత నృత్య కళల పై మక్కువ. విద్యాపరమైన విషయాలు విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. రీసెర్చ్ స్టూడెంట్లకు ,వైద్య విద్యార్థులకు తగిన సమయం. విదేసి అవకాశములు. వ్యక్తిగత శ్రద్ధ పెంచుకొనే దైనాందిన వ్యవహారాల్లో ఒక ప్రత్యేక విధానం అవలంబిస్తారు. ఆరోగ్య, ఆహార, అలవాట్లు మార్పులు. మరిన్ని మంచి ఫలితలకి వెంకటేశ్వర దేవాలయ సందర్శన మేలు.
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
ప్రారంభంలో దూర ప్రయాణానికి అవకాశం. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళతారు. వారము మధ్యలో వృత్తిపరమైన విషయాల మీద కొంత అశ్రద్ధ, అసంతృప్తి అధికంగా ఉంటాయి. గృహ స్థిరస్తుల వారసత్వ విషయాలు కీలక చర్చలు జాగర్తలు,మోసపోకుండా ఉండాలి. డ్రైవింగ్ పై శ్రద్ధ అవసరం.వృత్తిలో అధికారులతో విబేధములు ఉండకుండా చూసుకోవాలి. ఆర్ధిక, కుటుంబ ఖర్చులు అధికం. జీవిత భాగస్వామి ఆరోగ్యము పై శ్రద్ధ, ఖర్చులు అధికము. కుటుంబముతో భాగస్వామి బందు వర్గ కలయిక, సమావేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, సందర్శన. మరిన్ని మంచి ఫలితములకి సత్యనారాయణస్వామి దేవాలయ సందర్శన మంచిది.
మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలోపెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కొత్త విషయాలు మొదలైనవి ఆకస్మిక వాయిదా. ఆర్థిక సంబంధ విషయాలు జాగ్రత్తలు అవసరం. సంతాన సంబంధించిన ఖర్చులు. తండ్రి ఆరోగ్యం కొరకు శ్రద్ధ, ఆకస్మిక అవకాశములు, లాభదయక వాతావరణము. ఆలోచనలు ఫలిస్తాయి ఉన్నత విద్య విదేశీ ప్రయాణ అంశాలలో ఆలోచనలు. శత్రువులపై విజయం నైపుణ్యాలు పెరగటం, దగ్గర ప్రయాణాలు, కొత్త పరిచయాలు మోసానికి గురి కాకుండా జాగర్త అవసరం. సంతానవృద్ధి, సృజనత్మక విషయాలు బాగుంటాయి.వాహన కొనుగోలుకై ఆలోచనలు. గృహ వాహన విద్య మాతృ సంబంధ అంశాలు అధిక శ్రద్ధ.వృత్తిలో అభివృద్ధి.స్వంత వ్యాపారము పై ఆసక్తి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు లక్ష్మీనారాయణ స్తోత్రం మంచిది.
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
డా|| ఈడుపుగంటి పద్మజారాణి
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు
email : padma.suryapaper@gmail.com
phone : +91 93930 07560, +91 98492 50852
www.padmamukhi.com