|
|
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:57 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ల మధ్య వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యయ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే రిపబ్లికన్లను శిక్షించేందుకు మస్క్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.ట్రంప్ ప్రతిపాదించిన "బిగ్ బ్యూటిఫుల్ బిల్"ను మస్క్ తీవ్రంగా విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న కొందరు చట్టసభ సభ్యులు, బిల్లుకు మద్దతిచ్చే రిపబ్లికన్లపై ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి నిధులు సమకూర్చాలని గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చిన మస్క్‌ను కోరారు.దీనిపై స్పందించిన ట్రంప్.. "అతను (మస్క్) అలా చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది" అని ఎన్బీసీ న్యూస్‌తో అన్నారు. మస్క్ "అగౌరవంగా" ప్రవర్తించారని కూడా ట్రంప్ ఆరోపించారు. మస్క్‌తో సంబంధాన్ని చక్కదిద్దుకోవాలనే కోరిక తనకు లేదని, అతనితో మాట్లాడే ఉద్దేశం కూడా లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
Latest News