షాహిద్ అఫ్రిది మరణంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే
 

by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:56 PM

షాహిద్ అఫ్రిది మరణంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే

సోషల్ మీడియాతో పాటు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ వార్త నిజమో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇటీవల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించారంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక పాకిస్థాన్ న్యూస్ యాంకర్ అఫ్రిది మరణించినట్లు ప్రకటిస్తున్నట్లుగా ఉంది. అయితే దీనిపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా అది సత్యదూరమని తేలింది.ఆ వీడియోలోని చిత్రాలు, ఇతరత్రా అంశాలను ఏఐ ద్వారా సృష్టించినట్లు గుర్తించారు. వాస్తవానికి షాహిద్ అఫ్రిది ఆరోగ్యంగానే ఉన్నారని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. 

Latest News
Shubanshu Shukla's experience extremely valuable for India's Gaganyaan mission: ISRO Tue, Jul 15, 2025, 04:32 PM
Israel intercepts drone launched from Yemen towards Red Sea resort Tue, Jul 15, 2025, 04:28 PM
Shubhanshu Shukla returns from space, his family overwhelmed with emotion Tue, Jul 15, 2025, 04:27 PM
Nimisha Priya case: Last-minute negotiations bring big relief to Kerala nurse in Yemen, execution deferred Tue, Jul 15, 2025, 04:27 PM
'While Babri mosque was being demolished, the then PM was offering prayers', discloses Rajasthan Governor Tue, Jul 15, 2025, 04:06 PM