![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:52 AM
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మూడవ రోజు కూడా కొనసాగింది. తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గత రెండు రోజులుగా జరిగిన ఆపరేషన్‌లో కీలక మావోయిస్టు నేతలు సుధాకర్, భాస్కర్ సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.ఇదిలా ఉండగా, గతకొంతకాలంగా నేషనల్ పార్క్‌లో భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లుతోంది. అంతకుముందు మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ హతమయ్యారు. కాగా, సుధాకర్‌పై రూ.కోటి రివార్డు ఉండగా.. భాస్కర్‌పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Latest News