|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:37 AM
క్రికెట్ ప్రపంచంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్‌కు ఇకపై 'అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ'గా వ్యవహరించనున్నారు. ఆధునిక క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజ క్రీడాకారులు ఇంగ్లాండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌లను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా ఈ పేరు మార్పును ప్రకటించాయి. ఈ నెల 20 నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న భారత పర్యటనలో ఈ కొత్త ట్రోఫీని తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు.ఈ పేరు మార్పుతో ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్ట్ పోటీలకు ఏకరూపత వచ్చినట్లయింది. గతంలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు పటౌడీ ట్రోఫీ (మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరిట) కోసం పోటీపడగా, ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ (బీసీసీఐ వ్యవస్థాపక సభ్యులలో ఒకరి పేరిట) కోసం ఆడేవారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తరహాలోనే వేదికతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఒకే ట్రోఫీ కోసం తలపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Latest News