|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:33 AM
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌పై తొలిసారి పెదవి విప్పాడు. ఈ విషయంలో తన తండ్రి గురునాథ్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యారని, ఆయనకు టెస్ట్ క్రికెట్ అంటే అమితమైన ఇష్టమని పేర్కొన్నాడు. భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా భార్య పూజా పుజారా రచించిన 'ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్' పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ ప్రస్థానంలో తన తండ్రి పోషించిన పాత్రను గుర్తుచేసుకుంటూ.. ఆయనకు సంప్రదాయ క్రికెట్ పట్ల ఉన్న మక్కువను రోహిత్ వివరించాడు. "మా నాన్న ఒక రవాణా సంస్థలో పనిచేసేవారు. మా జీవితం కోసం అమ్మతోపాటు ఆయన కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనకు మొదటి నుంచి టెస్ట్ క్రికెట్ అంటే పిచ్చి. ఈ తరం ఆధునిక క్రికెట్ అంటే ఆయనకు అంతగా నచ్చదు" అని రోహిత్ పేర్కొన్నాడు.
Latest News