|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:07 AM
సత్తెనపల్లి పోలీసులు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి పరామర్శించారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నాం. 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంటే గాని పరిస్థితి ఏంటో చెప్పలేము అని డాక్టర్లు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ పెద్ద నెమలిపురిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పోలీసులు తనను ఎలా వేధించారో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో ద్వారా సూసైడ్ నోట్లో వివరంగా చెప్పాడు. ఒక సివిల్ మ్యాటర్ లో పోలీసులు జోకింగ్ చేసుకుని లక్ష్మీనారాయణ వేధించడం మంచి పద్ధతి కాదు. దీనికి కారకులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని అంబటి పేర్కొన్నారు.
Latest News