|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:42 AM
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు) కుప్పకూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని, అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. మీ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇస్తూ ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Latest News