|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:45 PM
కనిగిరి గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, 40 రోజుల పాటు సాగిన ఈ సమ్మర్ క్యాంప్‌లో విద్యార్థులు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కధలు చదవడం, రాయడం, చదరంగం, క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన వంటి అంశాలలో నైపుణ్యం పొందారని తెలిపారు.
ప్రతిరోజూ నిర్వహించిన శిక్షణతో విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. క్యాంప్ చివర్లో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక నాయకులు గయాజ్ భాష పుస్తకాలను బహుమతులుగా పంపిణీ చేశారు. ఈ తరగతులు విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడినట్లు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసలు కురిపించారు.