|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 07:12 PM
రాష్ట్రంలో బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల వధపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు స్పష్టం చేశారు. బక్రీద్ రోజున ఎవరైనా ఆవులు, ఒంటెలను లేదా దూడలను వధిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ప్రజలు తమ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుతూ, చట్టాలను ఉల్లంఘించే వారిపై జంతువుల సంరక్షణ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.
క్షేత్రస్థాయిలో అధికారులు నిఘా పెంచి, ఈ దినాల్లో జంతువుల వధ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పౌరులు చట్టపరమైన పరిధిలో ఉండి, ఇతర సముదాయాల భావాల్ని గౌరవిస్తూ పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.