|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:32 PM
మన దేశంలో ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన పేరు పార్లే-జీ. చౌకగా లభించే తినుబండారాల్లో పార్లే బిస్కట్ ఒకటి. అయితే, యుద్ధంతో ఛిన్నాభిన్నమై, తీవ్ర ఆహార కొరతతో కరువు కోరల్లో చిక్కుకున్న గాజాలో ఇదే పార్లే-జీ బిస్కెట్లు వాటి అసలు ధరకు ఏకంగా 500 రెట్లు అధిక ధరకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఈ మేరకు ఆంగ్ల మీడియా ఎన్డీటీవీలో కథనం వచ్చింది.గాజా నుంచి ఇటీవల వైరల్ అయిన ఒక పోస్టులో, ముంబై కేంద్రంగా పనిచేసే పార్లే ప్రొడక్ట్స్ తయారుచేసిన పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ 24 యూరోలకు (సుమారు రూ. 2,342) పైగా అమ్ముడవుతోందని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. భారత్‌లో అత్యంత చౌకైన ఆహార పదార్థాలలో ఒకటిగా నిలిచిన ఈ బిస్కెట్ల ధర అంత ఎక్కువగా ఉండటం చూసి సామాజిక మాధ్యమంలో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు."చాలా కాలం నిరీక్షణ తర్వాత, రఫీఫ్‌కు ఇష్టమైన బిస్కెట్లను ఈరోజు నేను సంపాదించగలిగాను. వాటి ధర 1.5 యూరోల నుండి 24 యూరోలకు పైగా పెరిగినప్పటికీ, రఫీఫ్‌కు ఇష్టమైన ఈ చిరుతిండిని కాదనలేకపోయాను" అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టును మొహమ్మద్ జవాద్ అనే వ్యక్తి ఇటీవల షేర్ చేశారు.
Latest News