180 మీటర్ల దూరంకే ఓలా బుక్ చేసుకున్న యువతి
 

by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:31 PM

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ యువతి చాలా తక్కువ దూరానికి కూడా ఓలా బైక్‌ను బుక్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. నిమిషంలో నడిచి వెళ్లగలిగే దూరానికి ఆమె ఓలా బైక్‌ను ఆశ్రయించడం వెనుక ఉన్న కారణం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.వివరాల్లోకి వెళితే, లక్నో నగరంలో ఓ యువతి కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న తన గమ్యస్థానానికి వెళ్లేందుకు ఓలా బైక్‌ను బుక్ చేసుకుంది. రైడ్ అభ్యర్థనను అంగీకరించిన రైడర్, పికప్ లొకేషన్‌కు చేరుకున్నాడు. ఇంత తక్కువ దూరానికి బైక్ ఎందుకు బుక్ చేసుకున్నారని ఆ యువతిని ప్రశ్నించాడు.అందుకు ఆ యువతి ఇచ్చిన సమాధానం విని రైడర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. "వెళ్లాల్సిన దూరం తక్కువే అయినా, ఆ దారిలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని చూస్తే నాకు భయం. అందుకే ఓలా బైక్ బుక్ చేసుకున్నాను" అని ఆమె బదులిచ్చింది. ఆమె చెప్పిన కారణంతో ఆశ్చర్యపోయినప్పటికీ, రైడర్ ఆమెను బైక్‌పై ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానంలో దించాడు. అనంతరం, ఆ యువతి ఆ కొద్ది దూరపు ప్రయాణానికి గానూ రూ.19 బిల్లు చెల్లించి వెళ్లిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది, కొందరు యువతి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇంత చిన్న విషయానికి టెక్నాలజీని వాడుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Bihar CM Nitish Kumar meets PM Modi in Delhi; discuss development and political issues Mon, Dec 22, 2025, 04:51 PM
Suryakumar Yadav to play two Vijay Hazare Trophy matches in Jan 2026 Mon, Dec 22, 2025, 04:45 PM
Coupang daily user count slips to 14 million range after data breach Mon, Dec 22, 2025, 04:43 PM
Rajnath Singh steers MoU between DRDO, Raksha University for R&D Mon, Dec 22, 2025, 04:42 PM
MP CM Mohan Yadav meets BJP Working President Nitin Nabin in Delhi Mon, Dec 22, 2025, 04:36 PM