|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 01:02 PM
రాష్ట్రంలో నైరుతి రుతుపవన కాలంలో సంభవించే తుఫానులు, వరదలు వంటి ఎటువంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సర్వసన్నద్ధమై ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. మాన్సూన్ సన్నద్ధతపై గురువారం సచివాలయం నుంచి ఆయన వివిధ ప్రభుత్వశాఖలతోపాటు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్టు గార్డు, ఎన్డీఆర్‌ఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నైరుతి రుతుపవన కాలంలో ఎక్కడైనా అధిక వర్షాలు, వాగులు, వంకలు పొంగి వరదలు సంభవించే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటే, వాటిని ముందుగానే అంచనా వేయాలని ఇందుకు సంబంధించి వాసర్ ల్యాబ్స్‌తో సమన్వయం చేసుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎ్‌సలు, ఇస్రోతో కలిసి సమన్వయంతో పని చేయాలని సీఎస్ చెప్పారు.
Latest News