|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 12:55 PM
క్వార్జ్ అక్రమాల కేసులో జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఐ సుబ్బారావు జిల్లా జైలుకు వెళ్లారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించే అవకాశం ఉంది. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది.
Latest News