|
|
by Suryaa Desk | Thu, Jun 05, 2025, 06:10 PM
బుధవారం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 47 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవడంతో, ఈ విజయాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఎం. చిన్నస్వామి స్టేడియం సమీపంలో వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.ఈ విషాద ఘటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సచిన్ తన సందేశంలో పేర్కొన్నారు. "బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగినది విషాదానికి అతీతమైనది. ప్రతి బాధిత కుటుంబానికి నా సానుభూతి. వారందరికీ శాంతి, బలాన్ని చేకూర్చాలని దేవుడిని కోరుకుంటున్నాను" అని సచిన్ తన 'ఎక్స్' పోస్ట్‌లో పేర్కొన్నారు.
Latest News