మీకూ ‘చికెన్ నెక్స్’ఉన్నాయి.. బంగ్లాదేశ్‌కు అసోం సీఎం కౌంటర్
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 06:42 PM

‘చికెన్ నెక్ కారిడార్’ విషయంలో తరుచూ బెదిరింపులకు పాల్పడుతోన్న పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో కూడా ఇలాంటి రెండు సన్నని భూభాగాలు ఉన్నాయని, అవి భారత్ కంటే మరింత సున్నితమైనవని హెచ్చరించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధి నేత మొహమ్మద్ యూనూస్ ఇటీవల చికెన్ నెక్ గురించి చేసిన వ్యాఖ్యలకు అసోం సీఎం కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు బంగ్లాదేశ్ మ్యాప్‌ను ఎక్స్‌ (ట్విట్టర్)‌లో హిమాంత పోస్ట్ చేశారు. పశ్చిమ్ బెంగాల్‌లోని సిలిగురి వద్ద ఉన్న చికెన్ నెక్.. ఈశాన్య రాష్ట్రాలను భారత దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే ముఖ్య భూభాగం.


మొదటి చికెన్ నెక్


‘బంగ్లాదేశ్‌కు చెందిన మొట్టమొదటి ‘చికెన్ నెక్’ అనేది ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్.. దక్షిణ దినాజ్‌పూర్ నుంచి దక్షిణ పశ్చిమ గారో హిల్స్ వరకు విస్తరించి 80 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మార్గంలో ఎలాంటి అవాంతరం ఏర్పడినా రంగ్‌పూర్ డివిజన్ మొత్తానికి బంగ్లాదేశ్‌లోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి..’అని ట్వీట్ చేస్తూ మార్గం చూపించే మ్యాప్‌ను కూడా షేర్ చేశారు.


రెండో కారిడార్


చిట్టగాంగ్ కారిడార్ అని పిలిచే మరో సన్నని భూభాగం ఉంది. ఇది దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకు 28 కిలోమీటర్ల పొడవులో ఉంటుంది. ‘ఇది భారతదేశంలోని చికెన్ నెక్ కంటే చిన్నదే అయినా, ఇది బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని (చిట్టగాంగ్)ను రాజకీయ రాజధాని (ఢాకా)తో కలిపే ఏకైక మార్గం’ అని శర్మ వివరించారు. ‘భౌగోళిక వాస్తవాలను మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. కొంతమంది వీటిని మర్చిపోతుంటారు’ అని యూనస్‌కు అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ చురకలంటించారు.


మార్చి చివరిలో చైనా పర్యటన సమయంలో ముహమ్మద్ యూనూస్.‘భారత ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్‌లాక్డ్ (సముద్రం మార్గం లేని రాష్ట్రాలు) అందుకే బంగ్లాదేశ్ సముద్ర గార్డియన్‌గా వ్యవహరిస్తుంది.. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెడితే ఈ ప్రాంతంపై పట్టు సాధించవచ్చు అని’ చైనాకు సూచించారు


ఈ వ్యాఖ్యలపై అప్పట్లో అసోం సీఎం తీవ్రంగా మండిపడ్డారు ‘భారతపు వ్యూహాత్మక చికెన్ నెక్ కారిడార్‌ను భయపెట్టే విధంగా చూపడం మామూలు విషయం కాదు. దేశంలోనే కొందరు కూడా ఈ మార్గాన్ని కట్ చేస్తే తూర్పు భారతదేశం వేరైపోతుందని ప్రమాదకరమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు’ అని ఏప్రిల్ 1న ట్వీట్ చేశారు.


చికెన్ నెక్ కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా రహదారి, రైలు మార్గాలు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇవి సాంకేతికంగా సవాళ్లతో కూడిన ప్రణాళికలు అయినప్పటికీ, సంకల్పం, నూతన ఆవిష్కరణలతో సాధ్యమే అని చెప్పారు.


ఏంటీ చికెన్ నెక్?


దీనిని సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. ఈ సన్నని భూభాగం వెడల్పు అత్యల్పంగా 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ఉత్తరంగా నేపాల్, భూటాన్; దక్షిణంగా బంగ్లాదేశ్‌ సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. ఈశాన్య రాష్టాలను, భారత్‌తో ఈ కారిడార్‌ అనుసంధానిస్తుంది. దీని ద్వారానే రోడ్డు, రైలు మార్గాలు వెళ్తాయి.

Latest News
SEBI mulls additional changes to strengthen buyback framework Sat, May 09, 2026, 12:50 PM
Nifty, Sensex rise notably this week as crude prices ease, rupee strengthens Sat, May 09, 2026, 12:48 PM
Allen's range and cleanliness of his hitting make him special: Boucher Sat, May 09, 2026, 12:46 PM
Vijay to meet Thol Thirumavalavan as TVK scrambles for majority in Tamil Nadu Sat, May 09, 2026, 12:44 PM
Suspected food poisoning at Tilak ceremony in Bihar's Gaya, over 40 fall ill Sat, May 09, 2026, 12:41 PM