|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 03:37 PM
'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించి పాకిస్తాన్‌కు ముందుగానే సమాచారం ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలకు కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఉగ్రవాద శిబిరాలపై దాడుల అనంతరం మాత్రమే పాకిస్తాన్‌తో చర్చలు జరిగినట్లు స్పష్టం చేసింది.
ఇటీవలి పార్లమెంటరీ కన్సల్టేటివ్ సమావేశంలో ఈ అంశంపై సభ్యులు ప్రస్తావించగా, కేంద్రం తేల్చిచెప్పింది – పాక్‌కు ముందుగానే సమాచారం ఇచ్చిన దానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఇటువంటి చర్య తీసుకోలేదని పేర్కొంది. దాడుల తర్వాత మాత్రమే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయని వెల్లడించింది.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివరణ వచ్చినది. జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తాజా వివరణతో ఆ విమర్శలకు కుండబద్దలు కొట్టినట్లయ్యింది.