|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 02:09 PM
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన సిరాజ్, సమీర్‌లను అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా సిరాజ్ సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తన గ్రూపులో ఉన్న సభ్యుల వివరాలను అధికారులకు తెలిపినట్టు తెలుస్తోంది. అతడి సమాచారం ఆధారంగా, పరారీలో ఉన్న ఆహింసా గ్రూప్ (అహిం గ్రూప్)కు చెందిన 12 మంది కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ 12 మందిని మానవ బాంబులుగా తయారు చేసి ఉండొచ్చనే అనుమానాలను ఎన్ఐఏ వ్యక్తం చేస్తోంది. వారి దురాలోచనలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థను కఠినతరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.