|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 11:42 AM
కడప జిల్లా జమ్మలమడుగులో ఆదివారం రాత్రి ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. బాలికలు కేకలు వేయడంతో స్థానిక కాలనీవాసులు అప్రమత్తమై, ఆ యువకుడిని పట్టుకున్నారు. కోపోద్రిక్తులైన స్థానికులు యువకుడిని దేహశుద్ధి చేసి జమ్మలమడుగు పోలీసులకు అప్పగించారు.
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.