|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 11:30 AM
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వైసీపీ నేత వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వంశీ అస్వస్థతకు గురికాగా.. కంకిపాడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం ఆయనను గుంటూరుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మరోసారి వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం వంశీని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. జీజీహెచ్‌లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో వంశీకి వైద్య పరీక్షలు అనంతరం బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
Latest News