|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 06:32 AM
భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం డేటా ప్రకారం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను ఇటీవల భారత్‌లో కనుగొన్నారు.NB.1.8.1 కోవిడ్ వైరస్ కేసు ఒకటి ఏప్రిల్‌లో తమిళనాడులో నమోదయింది. మే నెలలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రెండు సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌గా వర్గీకరించింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణమని పేర్కొంటున్నారు.దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ ఇన్‌ఫెక్షన్‌లు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో కోవిడ్ సంబంధిత మరణం నమోదయింది. కోవిడ్‌తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. రాష్ట్రంలో నాల్గవ కోవిడ్-19 మరణం నమోదయింది. డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో 21 సంవత్సరాల వ్యక్తి థానేలో మరణించాడు.
Latest News