|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 12:38 PM
టీం ఇండియా తరహాలో ఒకే జట్టులా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో వేగం పెరగాల్సి ఉందన్నారు. ‘2047 నాటికి వికసిత భారత్ సాధనకు వికసిత రాష్ట్రాలు’ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించి, పలు అంశాలపై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు.
Latest News