ఈ ఏడాది మంచి వర్షపాతం. ఇక వారి పంట పండినట్లే
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 07:52 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ఈసారి విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఎండలు మండిపోయే మే నెలలో ఈసారి భారీ వర్షాలు కురిసి వాన కాలం వచ్చేసిందా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురిసింది. అటు కర్ణాటకలో కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. రైతులకు ఇది భారీ శుభవార్త అనే చెప్పవచ్చు. పైగా 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలు..


అన్నదాతలకు వాతావరణ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. ఎందుకంటే ఈసారి రుతుపవనాలు త్వరగా వచ్చేస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోనున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంటే అనుకున్న సమయానికి వారం ముందే రుతుపవనాలు పలకరించనున్నాయి. దాదాపు 16 ఏళ్ల తర్వాత రుతుపవనాలు త్వరగా రావడం మళ్లీ ఇప్పుడే. చివరిసారిగా 2009, 2001లో రుతుపవనాలు కేరళను త్వరగా పలకరించాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ ఏడాది త్వరగా పలకరించనున్నాయి.


మరో 24గంటల్లో కేరళకు రుతుపవనాలు


సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1 లేదా తొలివారంలో రుతుపవనాలు కేరళను పలకరిస్తాయి. ఆ తర్వాత అవి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా సుమారు 107 ఏళ్ల క్రితం అనగా.. 1918లో, మే 11న రుతుపవనాలు కేరళను పలకరించాయి. ఇంత తొందరగా కేరళను రుతుపవనాలు పలకరించిన సంవత్సరం ఇదే. మళ్లీ ఎప్పుడు ఈ సీన్ రిపీట్ కాలేదు.


అయితే 2001, 2009లో మాత్రం సాధరణానికి భిన్నంగా వారం రోజుల ముందుగానే అంటే మే 24, 25 తేదీల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. మళ్లీ ఈ ఏడాది ఇదే సీన్ రిపీట్ కానుంది. ఈ క్రమంలో రాబోయే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారతీయ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం మే 27 వరకు రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.


గత సంవత్సరం, రుతుపవనాలు మే 30న కేరళను తాకాయి. మరోవైపు, కేరళలో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించిన రికార్డు 1972లో నమోదైంది, ఆ సమయంలో జూన్ 18న రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అనగా 2025లో గతేడాదితో పోలిస్తే.. ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే పలకరించడం అన్నదాతలకు కలిసి వచ్చే అంశం అంటున్నారు.

Latest News
India emerges as top user base for ChatGPT Images 2.0 Thu, Apr 30, 2026, 02:27 PM
Rights group demands immediate release of Pashtun human rights defenders in Pakistan Thu, Apr 30, 2026, 02:23 PM
ISI's long-game: Distraction, surveillance and a bigger plot ahead of UP polls Thu, Apr 30, 2026, 02:09 PM
Ashwini Vaishnaw flags off Vande Bharat Express train service from Jammu to Srinagar Thu, Apr 30, 2026, 02:06 PM
IPL 2026: Rohit Sharma still unfit as Mumbai Indians elect to bat against SRH Thu, Apr 30, 2026, 02:05 PM