|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:56 PM
ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ను కెప్టెన్‌గా ఎంచుకుంది. రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
Latest News