నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 04:19 PM

ఛత్తీస్‌గఢ్‌‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, సజ్జ నాగేశ్వరావు మృతదేహాలను అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నంబాల, నాగేశ్వరరావు తరపు బంధువులు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఈరోజు (శనివారం) విచారణ జరిపింది. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిందని ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఇప్పటికే 21 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశామని న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగింది ఛత్తీస్‌గఢ్‌లో అని అక్కడే పిటిషన్ వేయాలని ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. పోస్టుమార్టం పూర్తి అవ్వడంతో మృతదేహాలను ఇస్తామని చెబుతున్నారని... అందువలన పిటిషనర్‌లు ఛత్తీస్‌గఢ్ అధికారులను సంప్రదించవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు పిటిషనర్‌లకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. పిటిషనర్‌ల తరఫున సీనియర్ కౌన్సిల్ సత్యప్రసాద్ వాదించారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM