![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 03:46 PM
ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణంగా 50 ఏళ్లు పైబడిన పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వయస్సు పెరిగే కొద్దీ ఈ ప్రమాదం పెరుగుతుంది. మీ కుటుంబంలో తండ్రి లేదా సోదరుడికి ఈ క్యాన్సర్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ పురుషులలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ కొవ్వు ఆహారం తీసుకునే వారిలో ఈ ప్రమాదం త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు
*మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం
*మూత్ర విసర్జన తర్వాత మూత్రాశయం ఖాళీగా లేనట్లు అనిపించడం
*రాత్రిపూట తరచుగా మేల్కొనడం
*మూత్రంలో రక్తస్రావం
*పొత్తికడుపు లేదా జననేంద్రియాలలో తీవ్రమైన నొప్పి
*వీర్యంలో రక్తం
*వెన్నెముకలో విపరీతమైన నొప్పి
*అలసట, బలహీనంగా అనిపించడం
*బరువు తగ్గడం
Latest News